సిరా న్యూస్,ఏలూరు;
మహిళ పోలీసులు అభయ యాప్ పై ప్రజలకు విద్యార్థులకు స్థానిక ఆటో డ్రైవర్లకు విస్తృతమైన అవగాహన కల్పించారు. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి ప్రియా తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఏలూరు జిల్లా ఎస్పీ మహిళల భద్రత కోసం అభయ యాప్ ను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు రేంజ్ డీఐజీ ఐజి అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్ సెల్వి జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి లు సంయుక్తంగా ప్రారంభించారు ఈ యాప్ ప్రధాన లక్ష్యం మహిళల రక్షణ మా కర్తవ్యం నినాదంగా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి ప్రియతమ సిబ్బందితో విస్తృతంగా ఈ యాప్ గురించి నగరంలో అవగాహన కల్పించారు.