సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలతాయి. తొమ్మిది నుంచి పది మంది కీలక నేతలు అరెస్టులు ఉంటాయి. వారు చేసిన తప్పులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించాం అని సియోల్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పండుగ ముగిసింది… కానీ బాంబులు పేలలేదు. పొలిటికల్ బాంబులు పేలతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారం క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి టాపాసుకన్నా ముందే.. ఈ బాబులు పేలతాయని పేర్కొన్నారు. సియోల్ పర్యటన ముగిసిన తర్వాత ఇండియా బయల్దేరే ముందు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యటన ముగిసింది. మంత్రుల బృందం ఇండియాకు వచ్చింది. దీపావళి పండుగ కూడా ముగిసింది. కానీ, తెలంగాణ అంతా గురు, శుక్రవారాల్లో దీపావళి బాంబులే బాగా పేలాయి. జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో ఓ పొలిటికల్ బాంబు పేలినట్లు అనిపించినా.. అది కూడా తుస్సుమంది. దీంతో ఇప్పుడు రేవంత్ సర్కార్‌పై, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మంత్రి పొంగులేటి తెలంగాణ ప్రజలను ఫూల్స్ చేశారని అంటున్నారు. ఇక పొలిటికల్ బాంబులు ఎలా పేల్చాలో గులాబీ బాస్ కేసీఆర్ దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి ట్రైనింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారుమాటల మాంత్రికుడు కేసీఆర్. ఇది ఎవరూ కాదనలేని నిజం. అంతటి మాటల మాంత్రికుడికే గత ఎన్నికల్లో చెక్ పెట్టిన ధీరుడు రేవంత్‌రెడ్డి. బీఆర్ఎస్ను చిత్తుచేసి గత నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అంతేకాదు.. పార్టీని గెలిపించిన యోధుడిగా సీఎం పీటం దక్కించుకున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంత ఈజీ కాదు. కానీ అది రేవంత్‌రెడ్డికే సాధ్యమైంది. ఇక ఈ విజయం కేసీఆర్‌ను బాగా కుంగదీసింది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట తల ఎత్తుకుని నిలబడలేని పరిస్థితి. అందుకే అసెంబ్లీకి కూడా రాలేకపోతున్నారు. అయితే ఇంతటి ధీరుడు అయిన రేవంత్‌రెడ్డి మాత్రం పాలనలో ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోతున్నారు. కేసీఆర్‌ను మరిపించేలా పాలన చేయలేకపోతున్నారు. మరో నెల రోజుల్లో సీఎం పదవికి ఏడాది పూర్తి కావొస్తుంది. కానీ రేవంత్ తన మార్కు పాలన చూపించారా.. రాజకీయ పరిణతి ప్రదర్శించారా? కేసీఆర్‌లా చాజకీయ చతురత ప్రదర్శించారా.. అనే ప్రశ్నలకు రేవంత్‌కు కేవలం పాస్ మార్కులు మాత్రమే వస్తున్నాయి. హామీల అమలు పక్కన పెడితే.. రాజకీయ ప్రతిభ, చతురత అన్నది నాయకుడుకి చాలా అవసరం. ఇది రేవంత్‌రెడ్డిలో లోపించిందనే చెప్పాలితెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ 67 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అంటే భారీ మెజారిటీ ఏం కాదు. కానీ కేసీఆర్ తన రాజకీయ చతురత ఉపయోగించి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను టీఈఆర్ఎస్లో చేర్చుకున్నారు. మజ్లిస్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. 2018 ఎన్నికల నాటికి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారు. కానీ రేవంత్ ఏడాది పాలన చూస్తే అలాంటి చతురత ఏమీ కనిపించడం లేదు. కేసీఆర్ పొలిటికల్ గేమ్‌కు అందరూ ఫిదా అయ్యారు. కానీ, రేవంత్ గేమ్ పేలవంగా ఉంది. దీంతో కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇపుపడు ఎందుకు చేరామా అని బాధపడుతున్నారు.ఇక రేవంత్ విషయానికి వస్తే చేతలకాన్నా.. మాటలే ఎక్కువ. ఆయన ప్రభుత్వంలో కీలక మంత్రులు సైతం అదే పరిస్థితి. విపక్ష బీఆర్ఎస్ను ఖాళీ చేయిస్తామన్న మాట కాకున్నా.. ప్రతిపక్ష హోదా అన్నా లేకుండా చేయలేకపోయారు. మాటలు మాత్రం బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని పెద్దపెద్ద మాటలు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. కనీసం ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా దానం నాగేందర్, అరికెపూడి గాంధీ మినహా మరెవరినీ పార్టీలో చేర్చుకోలేకపోయారు. దీంతోఆయన ఆపరేషన్ ఆకర్ష్ ఓ ప్లాప్ షోగా మారింది. బీఆర్ఎస్ను ఖాళీ చేస్తామన్నది బిల్డప్పే అన్న అభిప్రాయం ప్రజల్లోనెలకొంది.రేవంత్‌రెడ్డి లాగానే ఆయన మంత్రుల మాటలు కూడా పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్లుగా ఉన్నాయి. తాజాగా పొంగులేటి చేసిన పొలిటికల్ బాంబుల మాటలన్నీ తుస్సుమన్నాయి. బాంబుల విషయం పక్కన పెడితే.. కనీసం సీమ టపాకాయలా కూడా పేలలేదు. దీంతో కేవలం రేవంత్లాగానే సంచలనాలకే మాటలు పరిమితం అవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది రేవంత్ సర్కార్ అసమర్థపాలనకు నిదర్శనమన్న భావన కలుగుతోంది.రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకే వెళ్లాలి. యూటర్న్ తీసుకోకూడదు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి నిలబడలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొలిటికల్ బాంబులు పేల్చడంలో ఆయన మరింత పరిణతి సాధించాలి. ఒకవేళ అంతటి నైపుణ్యం రాలేదనుకుంటే.. ప్రకటనలు చేయడం, చేయించడం మానుకోవాలి. ఆయన, ఆయన మంత్రులు చేస్తున్న మాటలు, సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రివర్స్‌గా కాంగ్రెస్‌కే తాకుతున్నాయి.