దసరా ఉత్సవాలలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం…
చిలుకూరు ఏఎస్ఐ పై చేయి చేసుకున్న ఏ ఆర్ కానిస్టేబుల్ వరకుమార్
సిరా న్యూస్,కోదాడ;
చిలుకూరు మండలం బేతవోలు గ్రామ కనకదుర్గమ్మ ఆలయ పరిధిలో మూత్రవిసర్జన చేస్తుండగా వెనక నుండి ఫోటో తీస్తూ కాలుతో తన్ని గ్రూపులలో పోస్ట్ చేయడంతో గ్రామంలోని బీసీ,ఎస్సీ ఇరువర్గాలు రాళ్లు, పైపులతో దాడులు చేసుకున్నారు. మాజీ సర్పంచ్ భర్త వట్టికూటి నాగయ్య ను ఏఆర్ కానిస్టేబుల్ వరకుమార్ వెనక నుండి తన్నడం ఘర్షణకు దారితీసింది. దాడిలో నాగయ్య వర్గీయుడికి తలపగిలి రక్తస్రావం అయింది. ఏఎస్ఐ పై చేయి చేసుకొని ఘర్షణకు కారకుడైన ఏఆర్ కానిస్టేబుల్ వరకుమార్ పై చిలుకూరు పోలీసులు కేసు నమోదు చేసారు. దైవదర్శనానికి బేతవోలు గుడికి వెళ్లిన కోదాడ టౌన్ సిఐ రాము ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో తలపై పైపు దెబ్బ తగిలింది. అయనను ఆసుపత్రికి తరలించారు.