17మందిని పట్టుకుని కాల్చి చంపారు
నలుగురు గాయాలతో మృతి
మావోయిస్టుల ప్రకటన
సిరా న్యూస్,బీజూపూర్;
ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఘటనా స్థలాన్ని సందర్శించాలని మీడియాకి విజ్ఞప్తి చేసింది. వాస్తవాలను ప్రపంచానికి అందించాలని మా తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ విజ్ఞప్తి అంటూ ప్రకటన వెలువడింది. ఎన్కౌంటర్ లో చనిపోయింది 14 మందే…17 మందిని పట్టుకొని కాల్చి చంపారని మరో నలుగురు గాయాలతో మృతి చెందారని వెల్లడించింది. 35 మంది చనిపోయారు. ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు జరపాలని నిర్ణయించింది. 11 సార్లు కాల్పులు జరిగాయని వెల్లడించింది. నారాయణపూర్ జిల్లా గోవాడి, బొండోస్-తులాతులి మధ్య అడవిలో పోలీసులు మరియు డీఆర్జీ G-బస్తర్ జవాన్లు ఎన్కౌంటర్ ఊచకోతకి పాల్పడ్డారని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. 35 మంది అమరులయ్యారు. ఈ ఎన్కౌంటర్ను తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఎన్కౌంటర్ (ఊచకోత)ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలనీ సూచింది.
నీతి (ఊర్మిళ) పొట్టవి, నందు మాండవి, మురళి మట్లమి,సురేష్, మీనా, మహేష్ మాండవిచ జుగ్ని కౌడో, విజయ్ (సుక్లు కొర్రం), బసంతి వడ్డా, అర్జున్ లేకమ్, జగ్ని వడ్డే, సోను కొర్రంచ, సీమ (జుగాయ్ కొర్రమ్), జమ్లీ మాండవి, కొంత దుగ్గ, సుక్కు (గుడ్డు సలాం), రోహన్ పెద్ద,మనోజ్ (సంపత్ మాండవి), సుశీల్ (ధన్ని కొవాచి), బుధ్రామ్ మడకం, ఫూలో (సుందరి ఓయం), జనీలా , మంగళి, రామ్దర్ కొర్రం, సుందర్ (కమలు కల్ము), అనిల్ దొడ్డి,జనబాతి కశ్యప్, సోమారు కడటి, నరేష్ (సోంబారు మాండవి), కామ్రేడ్ సుగ్దయ్ కశ్యప్, ఫుల్సింగ్ కోవాచి, లోకేష్ (సబ్బు), డ్ దాస్మతి పోయం, సుమన్ (శాంతో మడకం), మోహన్ మాండవి.
ప్రజల విముక్తి కోసం కృషి చేస్తూ అమరులైన ఈ సహచరులందరికీ బస్తర్ మాజీ డివిజనల్ కమిటీబి నివాళులర్పించింది.