SP Goush Alam: ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి:  ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి:  ఎస్పీ గౌష్ ఆలం
* ప్రజలు, విద్యార్థులు వారోత్సవాలలో పాల్గొనాలి

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) ను ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పిలుపునిచ్చారు. సోమ‌వారం ఆదిలాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసు కార్యాలయాలలో ప్రజల సమక్షంలో అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రజాహిత కార్యక్రమాల కు సంబంధించి వివరాలను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రజాహిత కార్యక్రమాలలో ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఫ్లాగ్ డే ను విజయవంతం చేయాలని తెలిపారు. అక్టోబర్ 21న స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్లో అమరవీరుల స్తూపం వద్ద జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు కలిసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న అమరవీరుల కుటుంబ సభ్యులకు అత్యంత గౌరవంతో ఆహ్వానించి బహుమతుల ప్నందా చేయడం జరుగుతుంద‌ని తెలిపారు.ఈనెల 26వ తారీకున స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో భారీ ఎత్తున మెగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాలల్లో, కళాశాలలో ఆన్లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, చేయు విధులు, అత్యవసర పరిస్థితుల్లో చేయవలసిన అంశాలపై, పోలీసులు చేసిన ప్రతిభ, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. ఆఫ్లైన్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్లో మండలల వారీగా విద్యార్థులను పోలీస్ స్టేషన్కు ఆహ్వానించి పోలీస్ స్టేషన్ నిర్వహణపై అవగాహనను కల్పించడం జరుగుతుంద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *