సిరా న్యూస్, ఓదెల
విద్యార్ధినిలను పరామర్శించిన యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామగాల్ల సురేష్
* కస్తూర్బా గాంధీ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి
పెద్దపెల్లి జిల్లా మంథనిలోని ముత్తారం మండలం లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 53 మంది విద్యార్ధినిలను ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను చికిత్స కోసం ఆదివారం రాత్రి పెల్లి జిల్లా మాత శిశు సంరక్షణ ఆసుపత్రికి తరలించారు. ఈవిషయం తెలుసుకున్న యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామగాల్ల సురేష్ సోమవారం ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యార్థుల హాస్టల్ పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ ను వెంటనే వేరే చోటికి తరలించాలని, 53 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు అధికారులు తెలుపాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట యూఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు.