సిరా న్యూస్, కుందుర్పి
వడ్డేపాళ్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
* గ్రామంలో పింఛన్ పంపిణీ
ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి ఏడు వేలు ఒకటవ తారికునే పింఛన్ అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్ర పాటానికి సోమవారం కుందుర్పి వడ్డేపాళ్యం గ్రామంలో పింఛను దారులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వికలాంగులు, వృద్దులు, వితంతువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. జై అమిలినేని సురేంద్రబాబు జై అంబికా, లక్ష్మినారాయణ జై చంద్రబాబు నాయుడు జైజై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.