సిరా న్యూస్, ఖానాపూర్:
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత…
+ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆయన ఖానాపూర్ పట్టణంలోని రామ్ నగర్ లో ఉన్న భైరవ స్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో పయనించాలని అన్నారు. ఆయన వెంట ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్, ఇతర నాయకులు ఉన్నారు.