సిరాన్యూస్, ఉట్నూర్
ఉట్నూర్‌కు మంత్రులు రాక.. సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఉట్నూర్ లోని కేబి కాంప్లెక్స్ కు రానున్నారు. ఈ నైపథ్యంలో బుధవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో పాటు అధికారులతో కలసి హెలిప్యాడ్ స్థలంతో పాటు మీటింగ్ హల్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణకు మంత్రి వర్గం రానున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ రైతు భరోసా పథకం పై అభిప్రాయాల సేకరణకు గురువారం అదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు.ఉట్నూర్ కే.బి.కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు వర్క్ షాప్ లో పాల్గొనడం జరుగుతుందని, రైతు భరోసా పథకం పై అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, డిఎస్పీ నాగేందర్, ఆర్డిఓ జీవాకార్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.