సిరాన్యూస్, ఓదెల
పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు : పశువైద్యాధికారి డాక్టర్ మల్లేష్
పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేస్తున్నామని పశువైద్యాధికారి డాక్టర్ మల్లేష్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లిలోన ప్రభుత్వ పశు వైద్యశాలలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేశారు. అనంతరం డాక్టర్ మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలోని రైతుల ఎద్దులకు, బర్లకు, ఆవులకు గాలికుంటు వ్యాధి సోకకుండా శుక్రవారం ఉచిత గాలికుంటు టీకాలు వేశామన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పోత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ ఆల్లసుమన్ రెడ్డి, పశు వైద్య సిబ్బంది మునీదర్, స్రవంతి, గణేష్, నాగరాజు, గోపాలమిత్ర సిబ్బంది గోపతి ప్రవీణ్, శ్రీపతి మహేష్, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.