సిరాన్యూస్, ఓదెల
విశ్వబ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించాలి : జిల్లా అధ్యక్షులు కట్ట రాజా నందం
* బీసీ కమిషన్‌కు వినతి
స్థానిక సంస్థల ఎన్నికలలో విశ్వబ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించాలని విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు కట్ట రాజా నందం అన్నారు. బీసీ కులగణాలలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ పదాలను ఒకే కులంగా పరిగణించాలని పెద్దపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కట్ట సదానందం ఆధ్వర్యంలో బీసీ కమిషన్ కు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కట్టా కట్ట రాజా నందం వినతి పత్రం అందించారు. అనంతరం అధ్యక్షులు కట్ట సదానంద చారి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో విశ్వ బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించాలని అన్నారు . తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశ్వబ్రాహ్మణాల యువకిశోర్లు 42 మంది బలి దానం చేసుకున్నారు . విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని అన్నారు వీరి వెంట పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగల మల్యాల కుమారస్వామి, జిల్లా కోశాధికారి నాగవెల్లి శ్రీమన్నారాయణ, మడుపు అంజయ్య, జిల్లా మహిళా అధ్యక్షులు శ్రీరాముల రేణుకా, సుప్ర జ తదితరులు పాల్గొన్నారు.