సిరా న్యూస్,విజయవాడ;
వరద బాధితుడిని వీఆర్వో చెంపపై కొట్టిన ఘటన వైరల్ అయింది. విజయవాడలోని అజిత్సింగ్ నగర్ లో వరద బాధితుడి చెంపపై వీఆర్వో జయలక్ష్మి కొట్టింది. వాటర్ బోటిల్, భోజనం, బియ్యం అడిగితే పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుడు వీడియో తీస్తుండగా జయలక్ష్మి చెంప చెల్లుమనిపించింది. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పినా సచివాలయ 259 వార్డు వీఆర్వో జయలక్ష్మి బాధితులను పట్టించుకోవటం లేదంటూ నిరసనకు దిగారు. జయలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.