సిరా న్యూస్,కడప;
కడప జిల్లాకు చెందిన నవాబ్ జాన్ అలియాస్ అమీర్ బాబు అనే టీడీపీ ీనేత ఢిల్లీలో జరిగిన ఓ ముస్లిం సంస్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, సీఎం చంద్రబాబు సైతం దీనికి మద్దతు తెలపడం లేదని నవాబ్ జాన్ వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురావడానికి అనుమతించబోమని తెలిపారు. చంద్రబాబు నాయుడు సెక్యులర్ మైండ్ ఉన్న వ్యక్తి అని, ఆయన హిందువులను, ముస్లింలను ఒకే కోణంలో చూస్తారన్నారు. నవాబ్ జాన్ మాటలు నేషనల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. టీడీపీ తరపున వకాల్తా పుచ్చుని వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకం అంటూ కీలక ప్రకటన చేసిన నవాబ్ జాన్ ఎవరో చాలా మందికి ముందుగా తెలియలేదు. అసలు తెలుగుదేశం పార్టీలో అలాంటి పేరుతో ఎవరూ ప్రముఖ నేత లేదు. కనీసం ఓ మాదిరి నేత కూడా లేరు. కానీ జాతీయ మీడియాలో ఆయన పేరుతో టీడీపీ విధాన నిర్ణయం అంటూ ప్రచారం కావడంతో ఆయన పేరు హైలెట్ అయింది. అయితే ఈ నవాబ్ జాన్ ను కడపలో అందరూ అమీర్ బాబు అని పిలుస్తారు. టీడీపీ తరపున ఒక్క సారి కడప అసెంబ్లీకి పోటీ చేశారు. ప్రస్తుతానికి టీడీపీ నుంచి ఆయనకు ఎలాంటి పదవి లేదు. నవాబ్ జాన్ అలియాస్ అమీర్ బాబుకు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతానికి ఎలాంటి పదవి లేదు. మైనార్టీ సెల్‌లోనూ ఆయన కీలకంగా లే్రు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లి ముస్లిం మత సమావేశంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ విధాన నిర్ణయం గురించి ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశంపై.. నవాబ్ జాన్ ప్రకటనపై ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. వక్ఫ్ బిల్లును టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లుగా ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ప్రకటన చేయలేదు. వక్ఫ్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టినప్పుడు అందులో ప్రతిపాదించిన నలభై సవరణల విషయంలో కూడా ఎలాంటి అభ్యంతాలు వ్యక్తం చేయలేదు. వక్ఫ్ బిల్లుకు టీడీపీ సానుకూలంగానే ఉందన్న సంకేతాలు వచ్చాయి. అదే సమయంలో మరో మిత్రపక్షం జేడీయూ కూడా మద్దతుగానే ఉంది. అయితే ఆ బిల్లును విపక్ష పార్టీల డిమాండ్‌తో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ప్రస్తుతం అది జేపీసీ దగ్గర ఉంది. తాము వ్యతరేకిస్తామని టీడీపీ కనీసం ఎలాంటి సంకేతాలు పంపలేదని అనుకోవచ్చు. ఎన్డీఏ 3.0లో టీడీపీ ప్రభుత్వం కీలకంగా ఉంది. ఓ రకంగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి సమాయంలో ఎన్డీఏ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కేంద్రం బలహీనంగా ఉంటుందన్న సంకేతాలు వస్తాయి. అందుకే టీడీపీ ఎప్పుడూ ఎన్డీఏ నిర్ణయాలను వ్యతేరిస్తున్నట్లుగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. మోదీ తీసుకుంటునన నిర్ణయాలను చంద్రబాబు సమర్థిస్తున్నారు. అందుకే అమీర్ బాబు అలియాస్ నవాబ్ జాన్ ప్రకటనకు అంత విలువ లేదని టీడీపీ వర్గాలంటున్నాయి.