సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
మున్సిపల్ చైర్మన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు: వార్డు కౌన్సిలర్ అబ్దుల్ ఖలీల్
నిర్మల్ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మున్సిపల్ కమిషనర్ లపై సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు ఖానాపూర్ 8వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ ఖలీల్, 2వ వార్డు కౌన్సిలర్ కారింగుల సంకీర్తన సుమన్‌లు ఫిర్యాదు చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తాము ప్రతిపక్ష కౌన్సిలర్లు కావడంతో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ వివక్ష చూపిస్తున్నారు. ఇటీవల నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీకి టీయుఎఫ్ఐడిసి 4.8కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. దీనిలో అధికార పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లకు రూ. 40లక్షలు కేటాయించగా, కేవలం మున్సిపల్ ఛైర్మెన్ వార్డు పరిధిలో 1.19 కోట్లు కేటాయించుకున్నారని ఆరోపించారు.కానీ ప్రతి పక్ష కౌన్సిలర్లమైన 2వ వార్డు, 8వ వార్డుకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం 10లక్షలు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేక వార్డుల్లో అభివృద్ధికి దూరమై రోడ్లు , డ్రైనేజీలు లేక మురికి కాలువలుగా దోమలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు.ప్రతిపక్ష కౌన్సిలర్లమనే అక్కసుతో మా వార్డులను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ టెండర్లను తక్షణమే రద్దు చేయించి ప్రతీ వార్డుకు సమానంగా సరిపడే విధంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మా వార్డుల్లో కూడా అభివృద్ధికి కృషి చేయాలని లేనియెడల ఈ విషయమై కోర్టుకి వెళ్ళడానికి కూడా వెనుకడమని అన్నారు.
