సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
అశ్వారావుపేట మండల కేంద్రం జంగారెడ్డిగూడెం రోడ్డులోని రత్నం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో మంగళవారం వినియోగ దారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్లో నీళ్లు కల వడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించాయని.. పెట్రోల్ బంక్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ద్విచక్ర వాహనాల నుంచి తిరిగి బాటిళ్లలోకి తీసిన.. నీళ్లు కలిసి ఉన్న పెట్రోల్ను చూపుతూ నిలదీ శారు. నీళ్లు కలిసిన పెట్రోల్కు బదులుగా తిరిగి పెట్రోలు ఉచితంగా ఇస్తామని.. వాహనాలను రిపేర్ చేపిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విని యోగదారులు ఆందోళన విరమించారు. సదరు పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీళ్లు కలవడం.. కల్తీ ఆరోపణలు వంటి ఘటనలు తరచుగా చోటుచేసు కుంటున్నా యాజమాన్యం నిర్లక్ష్యం వీడటం లేదు.