– స్వామివారి ప్రసాదంలో పంది, గొడ్డు కొవ్వు కలిపి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు
– ల్యాబ్ రిపోర్టుల్లో అడ్డంగా దొరికిపోయినా దొంగల ముఠా ఎదురు దాడి హేయం
– స్వామివారి ప్రసాదం కల్తీ వెనుక భారీ కుట్ర కనిపిస్తోంది
– ఐదేళ్లూ అనేక దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు
– ఇప్పుడు ఏకంగా వెంకన్న ప్రసాదం బండారం బయటపడింది
– జగన్ రెడ్డిని స్వామి వారు వదిలేసినా.. భక్తులు వదిలే ప్రశక్తే లేదు
సిరా న్యూస్,మచిలీపట్నం;
కలియుగదైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీ, ఇతర కైంకర్యాల్లో నెయ్యిలో సైతం జగన్ రెడ్డి కక్కుర్తి పడడం కలచివేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం, పవిత్రమైన భావం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వులు కలిపి కల్తీ చేయడం జగన్ రెడ్డి అరాచకానికి పరాకాష్ట. తామేమీ చేయలేదని బుకాయించే జగన్ రెడ్డి ల్యాబ్ రిపోర్టుల విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదో సమాధానం చెప్పాలి. స్వామివారిపై విశ్వాసం లేకపోతే పక్కకు తప్పుకోవాలి. అంతేగానీ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడడం అత్యంత హేయం. కలియుగ దైవంగా భావించే వెంకన్న విషయంలో ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారిని ఉరి తీసినా తప్పు లేదని కోట్లాది మంది భక్తులు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక లడ్డూ ప్రసాదం రుచి మారిందని, బరువు తగ్గిందనే ఫిర్యాదులు అనేకం వచ్చినా ఎప్పుడూ పట్టించుకోలేదు. మేము కూడా గతంలో అనేక సార్లు రుచిలో తేడాను గుర్తించాం. కానీ మరీ ఇంత నీచానికి తెగబడి భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడతారని ఊహించలేదు. ఇంత అడ్డగోలుగా దొరికిపోయిన తర్వాత కూడా జగన్ రెడ్డి అండ్ దొంగల గ్యాంగ్ ఎదురు దాడి చేయడం సిగ్గుచేటు. అంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామని ముందుకొచ్చినప్పుడే అనుమానించాలి. కానీ, అవేమీ పట్టించుకోకుండా అడ్డగోలుగా సరఫరా చేయడం వెనుక భారీ కుట్ర ఉంది. ఆవు పాలలో వెన్న శాతం చాలా తక్కువ ఉంటుంది. అందుకే నెయ్యి ధర పెరుగుతుంది. అయినా పట్టించుకోకుండా కమిషన్ల కోసం కాంట్రాక్టులిచ్చి స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేశారు. గతంలో రాముల వారి శిరచ్ఛేదనం చేశారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి రథాన్ని తగులబెట్టారు. దుర్గమ్మవారి రథానికున్న వెండి సింహాలను ఎత్తుకెళ్లిపోయారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టారు. గతంలో ఏడు కొండల్ని రెండు కొండలు చేస్తామన్నవారు ఏమైపోయారో చరిత్ర చెబుతుంది. ఇప్పుడు ఇంతటి నీచానికి పాల్పడిన జగన్ రెడ్డిని స్వామివారు వదిలినా.. స్వామివారి భక్తులు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విడిచిపెట్టదని గుర్తుంచుకోవాలి.