అప్రమత్తమయిన భత్రతాదళాలు
భయందోళనల్లో ప్రజలు
సిరా న్యూస్,చింతపల్లి;
ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో సిపిఐ మావోయిస్టు 20వ ఆవిర్భావ దినోత్సవం నేటి నుండి సెప్టెంబర్ 20వ వరకు జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు ఆంధ్ర ఒరిస్సా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరట లేఖ విడుదల చేశారు. దీంతో ఏఓబిలో ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అడవుల్లో పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. పోలీస్ కూంబింగ్ ముమ్మరం చేశారు. ప్రతి వెహికల్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ తో కల్వర్టులు వంతెన లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. పోలీస్ ఇంటిలిజెన్స్ నిఘా వర్గాలతో కనిపెడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. దీంతో మన్యవాసులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళన చెందుతున్నారు.