నేను చనిపోలేదు నా పించన్ పైసల్ నాకు ఇవ్వండి.సార్

బ్రతికుండగానే చనిపోయినట్లు నిర్ధారణ చేసి పింఛన్ ఆపిన అధికారులు
జిల్లా ఆఫీసులు. మండల ఆఫీసులు తిరిగినా కూడా ప్రయోజనం లేదు అంటున్న బాధితుడు
సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ గఫూర్ కు గత రెండు సంవత్సరాల నుండి పింఛన్ డబ్బులు రావడంలేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేసినా లాభం లేకుండాపోయింది. నువ్వు చనిపోయావు నీకు అందుకే పింఛన్ రావడం లేదని తేగేసి చెప్పారు. బతికుండగానే చనిపోయానని ఎలా నిర్ధారణ చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ బ్రతికున్న మనిషిని చనిపోయినట్లుగా నిర్ధారణ చేసిన ప్రతి ఒక్క అధికారిపై చర్యలు తీసుకోవాలని. తక్షణమే ఆయనకు వచ్చే పింఛన్ పైసలు ఇప్పటివరకు రావలసిన డబ్బులు మొత్తం ఆయనకు ఇవ్వాలని స్థానికులు
డిమాడ్ చేస్తున్నారు..
మండల ఎంపీడీవో శ్రీనివాస్ ను వివరణ కోరగా రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ గఫూర్ అనే వ్యక్తి చనిపోయాడని చెప్పి పింఛన్ తొలగించిన విషయం నా దృష్టికి ఇప్పుడే రావడం జరిగింది. ఈ విషయాన్ని విచారణ జరిపి రెండు రోజులలో పరిష్కరించే విధంగా చూస్తానని వివరణ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *