సిరా న్యూస్,కాకినాడ;
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్రాఫిక్ కష్టాలపై వాహనదారులు మండిపడుతున్నారు. జిల్లా ప్రధానకేంద్రం అమలాపురంలో పలు షాపింగ్ మాల్స్ ప్రారంభం కావడంతో రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నా మాల్స్ నిర్వాహకులు ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం హైస్కూల్ సెంటర్ లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోతున్న పరిస్ధితి కనిపిస్తోంది. షాపింగ్ మాల్స్ ప్రధాన రోడ్డును ఆనుకుని ఉండటంతో రోడ్డుపైన పార్కింగ్ చేస్తున్నారు వినియోగదారులు. ఈ రహదారిలో ప్రధాన ఆసుపత్రులు ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్ వాహనాలు సైతం ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రైవేట్ సిబ్బందితోపాటు పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న అరికట్టలేని విధంగా ఉంది. దీంతో పోలీసులపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ సదుపాయం లేనిచోట్ల షాపింగ్ మాల్స్ కు అనుమతులు ఇవ్వడం ఎందకని ఫైర్ అవుతున్నారు. ట్రాఫిక్ కష్టాలను చూసి అమలాపురం పట్టణం రావాలంటే జిల్లా వాసులు భయపడుతున్నారు. అమలాపురానికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వస్తున్నాయని ఆనందపడాలా? లేక.. కనీసం బైక్ పై కూడా వెల్లలేని పరిస్థితి ఏర్పడిందని విచారణ చెందాలా? అంటూ వాపోతున్నారు జిల్లా ప్రజలు