పత్తికొండ ఇరుకు మెయిన్ రోడ్డుతో ప్రజల ఇక్కట్లు
కూటమిలోనైనా విస్తరణకు మోక్షం కలుగునా?
సిరా న్యూస్,పత్తికొండ;
పాలకులకు పుట్టినిల్లే వ్యపార వ్యవహారాలకు ప్రధాన కేంద్రమే! కాని ఏం లాభం? ప్రజలకు అన్ని విషయాలలోనూ అగచాట్లే! అందులో ప్రధానమైనది ఇరుకైన మెయిన్ రోడ్డు. ఎందరో ప్రజాదరణ కలిగిన ప్రజా ప్రతినిధులను అందించిన ఈ పట్టణానికి రోడ్డు విస్తరణ ఏ నాయకుడూ ఇంత వరకూ చేయలేక పోవడం ప్రజల దురదృష్టం. మారుమూల పల్లెల్లో, చిన్నచిన్న కూడ జరిగిన రహదారి విస్తరణ, పత్తికొండ విషయంలో ఎందుకు జరగడంలో అర్ధం కాని విషయం.ఏ – శక్తి,ఏ యుక్తి ఈ మంచి పనికి అడ్డు తగులుతోందో అన్నది జవాబు దొరకని ప్రశ్న లా మిగిలింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్నికల సమయంలో రోడ్డు విస్తరణ పై నేతలు ఇస్తున్న హామీలు గాల్లో కలుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న పట్టణాలలో సైతం రోడ్డు విస్తరణ పనులు జరిగిన పత్తికొండ మెయిన్ రోడ్డుకు మోక్షం కలగలేదు. కూటమి ప్రభుత్వంలోనైనా రోడ్డు విస్తరణ పనులు జరిగే అవకాశం ఉందా లేదా అని ప్రజల్లో చర్చనీయంగా మారింది. . పత్తికొండ నియోజకవర్గం మండల కేంద్రానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వ్యాపారం రీత్యా గ్రామాల నుండి నిరంతరం ప్రజలు రాకపోకలు చేస్తూ ఉంటారు. పత్తికొండ పట్టణంలో నిరంతరం ట్రాఫిక్ సమస్యతో అనేక ప్రమాదాలు చోటుచేసుకోవటమే కాకుండా పోలీసులకు ప్రతిరోజు ఓ సవాల్ గా ఉన్న పరిస్థితి. ఎన్నికల సమయంలో పాలకులు రోడ్డు విస్తరణ పై హామీలు కుప్పించటం తప్ప ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. ” ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నేతలు పత్తికొండ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టిని పెట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని
స్థానికులు తో పాటుగా చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.