సిరా న్యూస్,ముంబై;
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఇక లేరు. బ్రీచ్ క్యాండీలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. అతను వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తనకుతానే సాటి. గత కొన్నేళ్లుగా యువతను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు కూడా. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆయన్ను ద్వేషించే వారెవరూ లేరని ఓ సందర్భంలో రతన్ టాటానే స్వయంగా అన్నారు. ఏ వ్యాపారవేత్తకు ఇంత గౌరవం లభించలేదు. అయితే ప్రస్తుతం ఆయర మరణానంతరం ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేది సర్వత్రా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రతన్ టాటా ఆజన్మ బ్రహ్మచారి. వారసులు లేనందున టాటా గ్రూప్ సంస్థల పగ్గాలు ఎవరు చేపడతారనే దానిపై చర్చసాగుతోంది.టాటా గ్రూప్‌లో వారసత్వ ప్రణాళికపై దేశ ప్రజల్లో ఉత్సుకత నెలకొంది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎవరు నడిపిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజానికి, రతన్ టాటా.. ఇందుకు ఏర్పాట్లు ఎప్పుడో పూర్తి చేశారు. టాటా గ్రూప్‌కి ప్రస్తుతం ఎన్ చంద్రశేఖ టాటా సన్స్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2017 నుంచి ఆ బాధ్యతలు చేపట్టారు. ఆయన కుటుంబంలోని సభ్యులంతా వ్యాపారంలో వివిధ రంగాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆ రకంగా చూస్తూ భవిష్యత్తులో టాటా గ్రూప్‌కు బాధ్యత వహించడానికి చాలా మందే ఉన్నారని చెప్పవచ్చు.
టాటా సన్స్ వారసుడు ఎవరు?
సిమోన్‌తో నావల్ టాటా రెండో భార్య కుమారుడు నోయెల్ టాటా.. రతన్ టాటాకి సవతి సోదరుడు. తాజా పరిస్థితుల్లో నోయెల్ టాటాను ఈ వారసత్వాన్ని అందుకునే ప్రధాన పోటీదారుల్లో ఒకరుగా చెప్పవచ్చు. నోయెల్ టాటాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాయ, నెవిల్లే, లేహ్ టాటా. వీరు కూడా సంభావ్య వారసులే.
మాయా టాటా
34 ఏళ్ల మాయా టాటా టాటా గ్రూప్‌లో కీలక పదవిలో కొనసాగుతున్నారు. బేయెస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో విద్యాభ్యాసం చేసిన ఆయన టాటా ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ టాటా డిజిటల్లో కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా, అతను తన వ్యూహాత్మక చతురత, దూరదృష్టిని ప్రదర్శిస్తూ టాటా కొత్త యాప్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించాడు.
నెవిల్లే టాటా
నెవిల్లే టాటాకు 32 యేళ్లు. కుటుంబ వ్యాపారంలో చురుకుగా ఉన్నవారిలో నెవిల్లే టాటా ఒకరు. టయోటా కిర్లోస్కర్ గ్రూప్‌కు చెందిన మాన్సీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్న నెవిల్లే, ట్రెంట్ లిమిటెడ్ కింద స్టార్ బజార్ అనే కంపెనీకి అధిపతి.
లేహ్ టాటా
39 ఏళ్ల లియా టాటా.. టాటా గ్రూప్ హాస్పిటాలిటీ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. స్పెయిన్‌లోని ఐఈ బిజినెస్ స్కూల్లో చదివిన లేహ్ టాటా తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్‌లలో కీలక హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం, ఆమె ప్రస్తుతం ఆతిథ్య పరిశ్రమలో ఇండియన్ హోటల్ కంపెనీని నిర్వహిస్తోంది.
టాటా గ్రూప్ విలువ 400 బిలియన్ డాలర్లు
నివేదికల ప్రకారం.. ఆగస్టు 2024 నాటికి, టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీల మార్కెట్ క్యాప్ 400 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.35 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీకి చెందిన 29 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. గ్రూప్‌లో అతిపెద్ద కంపెనీ టాటా కన్సల్టెన్సీ. 9 అక్టోబర్ 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,38,519.36 కోట్లుగా నమోదైంది. మార్కెట్ క్యాప్ పరంగా TCS దేశంలో రెండవ అతిపెద్ద IT కంపెనీ. రతన్ టాటా నాయకత్వంలో టిసిఎస్ అత్యధిక వృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఇన్ఫోసిస్, విప్రో వంటి పెద్ద ఐటి కంపెనీలను దాటి అనతి కాలంలోనే నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది