సిరా న్యూస్,కాకినాడ;
దేశంలో మడ అడవులు అత్యధికంగా ఉన్న రెండవ ప్రాంతం గా తాళ్లరేవు మండలం కోరంగి విరా జిల్లుతోందని ముమ్మిడివరం ఎమ్మె ల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆయన కోరంగి మడ అడవుల్లో నిర్వహిం చిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మడ అడవులసంరక్షణ ,వన్యప్రాణులను ఎలా కాపాడాలి, ప్రకృతిని ఎలా ప్రేమించాలి తదితర అంశాలపై పై పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఎకో డెవలప్మెంట్ కమిటీల ద్వారా ఇక్కడ 20 లక్షల రూపాయలు ఉన్న ఆదాయం కోటి 77 లక్షలకు పెంచడం జరిగింది అని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇందులో 50 శాతం ఈ కమిటీలు ఇస్తారని తెలిపారు. ఒక్కో కమిటీకి 20 లక్షల రూపా యల వంతున చెక్కులు పంపిణీ చేశారు .అనంతరం ఎమ్మెల్యే బుచ్చిబాబు మీడియాతో మాట్లాడారు.