సిరా న్యూస్,హైదరాబాద్;
బిజెపి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు శనివారం ఉదయం భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం లో పూజలు చేసారు. తరువాత ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం, తర్వాత అమరవీరుల స్థూపం చేరుకొని నివాళులర్పించారు. అక్కడినుంచి శాసనసభకు చేరుకున్నారు.