ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి యాదవ మహాసభ పాలాభిషేకం

సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపిన యాదవులు

సిరా న్యూస్,మంథని;

యాదవుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర పండుగగా గుర్తింపు రావడానికి ప్రత్యేకమైన కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు మంథని మండల అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి యాదవ సంఘం నాయకులు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత యాదవ మహాసభ మంథని మండల శాఖ అధ్యక్షులు పర్శవెన మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుత పర్వతాలు యాదవ్, మండల ఉపాధ్యక్షులు కనగంటి ఓదెలు యాదవ్, ప్రధాన కార్యదర్శి భాషా అశోక్ యాదవ్,సీనియర్ నాయకులు పెరవేన లింగయ్య యాదవ్, జాగరి సదానందం యాదవ్, చిన్నవేనా సదానందం యాదవ్, మండల యూత్ సెక్రెటరీ గడ్డి కుమార్ యాదవ్, కావటి సతీష్ యాదవ్, కావటి సందీప్ యాదవ్, కావేటి భూమయ్య యాదవ్, మద్దెల రాజయ్య యాదవ్, కావటి సమ్మయ్య యాదవ్, ఒగ్గు రమేష్ యాదవ్, కనవేనా కుమార్ యాదవ్,, కనవేనా ఓదెల యాదవ్, పర్శవెన ఓదేలు యాదవ్, మిర్యాల శ్రావణ్ యాదవ్, దోరగొర్ల శీను యాదవ్, దాసరి చంద్రమోహన్ యాదవ్, అప్పాల అశోక్ యాదవ్, కనవేన స్వామి యాదవ్, పర్సవేనా సంజయ్ యాదవ్, పేరవేనా రాజేష్ యాదవ్, లగ్నూరి రవి యాదవ్, అర్థం సది యాదవ్, పరుషవేనా రాజయ్య యాదవ్, మధునయ్య యాదవ్, మధుకర్ యాదవ్, ఉడత రవి యాదవ్, పుట్ట రాజయ్య యాదవ్, మద్దూరి సతీష్ యాదవ్, నర్రా ఓదెలు యాదవ్, అమ్మ కుంటి నరేష్ యాదవ్, అమ్మ కుంటి సదయ్య యాదవ్, బోసరి లింగయ్య యాదవ్, అర్థం రాజేందర్ యాదవ్, జక్కుల కుమార్ యాదవ్, సంధవేన మధుకర్ యాదవ్, రాపాక మధుకర్ యాదవ్ లతో పాటు అధిక సంఖ్యలో యాదవులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *