సిరా న్యూస్,తుని;
ప్రముఖ పుణ్యక్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలిచే శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు లోవ దేవస్థానంలో శరన్నవరాత్రులు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హజరయ్యారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ తలుపులమ్మ లావ దేవస్థానాన్ని టూరిజం గా మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పార్కింగ్ ఇబ్బందిగా ఉందని తన దృష్టికి వచ్చిందని చుట్టుపక్కల రైతులతో మాట్లాడి పార్కింగ్ మెరుగుపరిచే విధంగా కృషి చేస్తానన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని ఆదేశించారు.