సిరాన్యూస్, బజార్‌హత్నూర్
శ్రీ రాజ రాజేశ్వర విద్యాసంస్థలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామంలోని గురువారం శ్రీ రాజ రాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యం లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈసందర్బంగా కళాశాల కరస్పాండెంట్ స్వర్ణలత మాట్లాడుతూ తెలంగాణ అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ ఆడపడుచుల ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాల భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన నుండి మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా విద్యార్థినిలు చేసిన కోలాటం, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ఆధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.