యువకులకు కత్తిపోట్లు
సిరా న్యూస్,గూడూరు;
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు లో జరిగిన ఆంజనేయస్వామి జెండా ఉత్సవంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొన్ని జండాల వద్ద ఘర్షణల్లో ముగ్గురు యువకులపై కత్తులతో దాడి జరగడంతో గూడూరు లో కలకలం రేగింది. ఈ ఘర్షణలో యశ్వంత్ ,హరీష్ ,అబ్దుల్ అనే యువకులకు కత్తిపోట్లకు గురయ్యారు. పాత కక్షలే ఘర్షణలకు దారితీసి ఉండవచ్చని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు… ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.