సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
పెద్దపల్లి జిల్లా ఓదెల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. పద్మ రాధాకృష్ణ చిత్రపటానికి పుష్పమాల అలంకరించి, ఉపాధ్యాయ దినోత్సవం గురించి రాధాకృష్ణన్ సేవల గురించి వివరించారు. అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, ఎంత ఎదిగిన తమ గురువులను మరచిపోవద్దని తెలిపారు. ఉపాధ్యాయులను, సీఆర్పీలను ఐఆర్పిను విద్యార్థుల చేత సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిలు ఐఆర్పి, విద్యార్థులు పాల్గొన్నారు.