ఘనంగా సదర్ ఉత్సవాలు పాల్గొన్న ఈటెల, అందెల

సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని పెద్ద అంబర్పేట్ లో శ్రీ కృష్ణ యాదవ్ యువజన సంఘం ఆధ్వర్యంలో యాదవుల సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా జరుపుకునే సదరు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ సి పాల్గొన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ యాదవ సోదరులకు సదర్ మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దున్న రాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి, బీజేవైఎం నాయకులు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *