(సిరా న్యూస్) బోథ్
మహిళా సాధికారతే మా ధ్యేయం: కాంగ్రెస్ పా పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్.
బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి.
తెలంగాణ ప్రధాత, యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా భోథ్ బస్టాండ్ సమీపంలో డీజే చప్పులతో మిఠాయిలు పంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తెలంగాణ ఇచ్చిన తల్లి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని సోనియ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని మొదటగా మహాలక్ష్మి పథకంలోని రాష్ట్ర మహిళలందరి కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా బీమా పథకాన్ని 10 లక్షల వరకు పెంచుతున్నట్టు భోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన మాటను రెండు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీల అమలులో ముందున్నారని రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల పురోభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సమీప భవిష్యత్తులో అన్ని హామీలను పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి ప్రపులు చందర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్, స్థానిక ఎంపిటిసిలు శేఖ్ రజియా బేగం నాజర్ అహ్మద్, కురుమే మహేందర్, వివిధ మండలాల అధ్యక్షులు వసంత్, షేక్ ఇమామ్, శేఖర్ సామాన్పల్లి, బత్తుల రమేష్, గాజుల పోతన్న, గుడాల శేఖర్, రాజశేఖర్, దౌలత్రావు, మహేందర్, అంకత్ రవి, గోదుమల్ల దినేష్, నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.