సిరా న్యూస్,హైదరాబాద్;
ఛత్తీస్ గఢ్ లో జనవరి నుంచి భద్రతా బలగాలు జరిపిన కూంబింగ్ లో 194 మంది నక్సలైట్లు హతమైనట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 801 మంది అరెస్టు సహా 742 మంది లొంగిపోవడంపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. నక్సలిజంతో సంబంధం ఉన్న యువకులందరూ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.