సిరా న్యూస్, దస్తురాబాద్:
అందరికి కోసం ఆరు గ్యారంటీలు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరోగ్యారెంటీలను అర్హులైన ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సింగారి కిషన్ అన్నారు. గురువారం ఆయన ఇతర అధికారులు, నాయకులతో కలిసి నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని అకొండ పేట, మున్యాల తాండ తదితర గ్రామాల్లో అభయ హస్తంలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంక్షేమ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజు నాయక్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఎం పి ఓ అనిల్, సర్పంచ్ దుర్గం పోశలింగు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.