సిరాన్యూస్, గుడిహాత్నూర్:
గుడిహాత్నూర్ మండలం లో చిరుత సంచారం..
ఆవుపై దాడి చేసి చంపేసిన చిరుత..
అదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండలం ధమన్ గూడ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుత పులి ఆవు పై దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. మనేకర్ కృష్ణ అనే వ్యక్తి కి చెందిన ఆవుపై చిరుత దాడి చేసి చంపేయడoతో. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా చిరుత సంచారం పై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.