సోమశిల సమీపంలో 93 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రెండు కార్లుతో 5గురు అరెస్ట్
సిరా న్యూస్,నెల్లూరు;
జిల్లా సోమశిల సమీపంలో 93 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం చేసుకుని, ఐదుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలు మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వారి ద్వారా రాబడిన విశ్వసనీయ సమాచారం తో ఆర్ ఐ (ఆపరేషన్స్)కె. సురేష్ కుమార్ రెడ్డి టీమ్స్ లోని ఆర్ ఎస్ ఐలు కె. సురేష్ బాబు, టి.విష్ణు వర్ధన్ కుమార్ బృందం సోమశిల-అనంత సాగరం మార్గం లో ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారిలో నలుగురిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా, ఒకరిని పాండిచ్చేరి వాసులు గా గుర్తించారు. వారి నుంచి 93ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వారిని టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించగా, ఎస్ ఐ సీహెచ్ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు. ఇందులో ముఖ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *