సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు…
మహిళా సాధికార లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని ఇంద్రవెల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉత్తమ్ ముఖడే అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఈ మేరకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకమీదట మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీకి కట్టుబడి ఉందని అన్నారు. ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో కలిసి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ మసూద్, మహిళ అధ్యక్షులు సొంకాంబ్లీ లక్మి బాయి, నాయకులు మీర్జా యాకుబ్ బేగ్, సొంకాంబ్లీ జితేందర్, జహీర్, కనక తులసి రామ్ నగోరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..