సిరాన్యూస్, ఓదెల
ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం,పోత్కపల్లి గ్రామానికి చెందిన ఎండి ఖలీంపాషా అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోగా అపరేషన్ తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. ఎండి. ఖలీంపాషా కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయక నిది ద్వారా రూ. 1,00,000/ ఎల్ వో సి చెక్కును మంజూరైంది. గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఎండి.ఖలీంపాషా కి చెక్కును పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.