కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
సిరా న్యూస్,హైదరాబాద్;
జమిలి ఎన్నికలను బిజెపి తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడమే లక్ష్యంగా బిజెపి కసరత్తు చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన వాటిపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. నియోజకవర్గాల పునర్విభజన, బీసీ కుల గణన, జనాభా లెక్కలు వంటి అంశాల జోలికి పోవడం లేదు. నాలుగో సారి అధికారంలోకి ఎలా రావాలి? బిజెపి ఎలా బలపడాలి అనే అంశాలపై మాత్రమే దృష్టి పెట్టింది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో రాజకీయ పార్టీలను ఏ విధంగా అణిచివేయాలనే దానిపై సీరియస్ గా ఆలోచన చేస్తుంది. ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు దీనిపైనే ప్రధానంగా చర్చ చేస్తుంది. ఇది ఒక రకంగా ప్రజలపై, ప్రాంతీయ పార్టీలపై, ప్రతిపక్షాలపై చేస్తున్న కుట్రగా భావించాల్సి ఉంటుందని అన్నారు.