ఏడుగురికి తీవ్ర గాయాలు
సిరా న్యూస్,అమలాపురం;
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం రావులచెరువులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంట్లో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆమలాపురం ఏరియా ఆసుపత్రి కి తరలించారు. గ్యాస్ పేలుడు ధాటికి ఇల్లు తునా తునక లైంది. ఇంట్లో దీపావళి మందు గుండు సామాగ్రి పటాస్ మందు వండడంతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని స్థానికులు అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు, అమలాపురం పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమీక్షీంచారు.