బాణాసంచా పేలి పలువురికి గాయాలు
సిరా న్యూస్,మనుబోలు;
నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామం బీసీ కాలని లో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది బాణాసంచా పేలి సుమారు 20 మందికి పైగా గ్రామస్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు, గాయాలైన వారిలో నలుగురికి పైగా పిల్లలు వున్నారు.
మనుబోలు గ్రామం బిసి కాలనీ లో వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు భారీ ఎత్తున బాణాసంచా పేల్చుతూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు,బాణాసంచా పేల్చే క్రమంలో పొరపాటున బాణాసంచా నిల్వ ఉంచిన ప్రాంతంలో నిప్పురవ్వ పడడంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో పేలుడు సంభవించింది ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న 20 మందికి పైగా గ్రామస్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు, వీరిలో ముఖ్యంగా పిల్లలు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి, వీరిలో ఒకరికి కన్ను దెబ్బ తినడం ,మరొకరి చేతికి తీవ్ర గాయాలు అవ్వడం మరి కొందరికి శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో క్షతగాత్రులను హుటాహుటిన గూడూరు ప్రభుత్వాసుపత్రికి కొందరిని, నెల్లూరు జిల్లా ఆసుపత్రికి మరికొందరిని,నెల్లూరు లో ప్రైవేట్ ఆస్పత్రికి కొందరిని తరలించారు వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం…