మునిసిపల్ కమిషనర్ సుడిగాలి పర్యటన
సిరా న్యూస్,జంగారెడ్డిగూడెం;
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ సుడిగాలి పర్యటన చేసారు. పట్టణం లోని పలు చికెన్, మటన్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేసారు. ఒక దుకాణంలో నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 25 కేజీల మాంసాన్ని డంపింగ్ యార్డ్ కు తరలించారు. నిల్వ ఉంచిన చికెన్ ,మటన్ మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అయన హెచ్చరించారు.