సిరాన్యూస్,ఓదెల
జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద
* కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద జెండా ఆవిష్కరించారు. ఈసందర్బంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మాట్లాడారు. ఏటా సెప్టెంబర్ 17వ తేదీని “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” గా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ .కోయ శ్రీహర్ష , రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , అదనపు కలెక్టర్ జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్ (రెవిన్యూ), అదనపు కలెక్టర్ అరుణ (స్థానిక సంస్థలు), డీసిపి చేతన, ఎసిపి గజ్జి కృష్ణ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.