Masam Lakshmi Welfare Society Anil kumar: 300 మందికి కంటి పరీక్షలు : మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్

సిరాన్యూస్‌,బోథ్‌
300 మందికి కంటి పరీక్షలు : మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌ల కేంద్రంలో బుధ‌వారం మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వ‌హించారు. ఈ నేత్ర శిబిరం కి 300 వరకు హాజరు అయ్యి కంటి పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ మాట్లాడారు. మా అన్న మాసం కిరణ్ మొదటి వర్థంతి సందర్భంగా ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ సహకారం తో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరం కు అనుకున్న దానికన్నా ఎక్కువ స్పందన వచ్చింద‌ని తెలిపారు. 300 వరకు హాజరు అయ్యి కంటి పరీక్షలు చేసుకున్నారని తెలిపారు. అందరికీ కంటి పరీక్షలు అయిన వారు ఎవరికి ఎవరికి కళ్ళ అద్దాలు , దాదాపు 50 మంది ఆపరేషన్ కి అర్హులు తెలిపారు. వారికి మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా త్వరలో అద్దాలు , ఆపరేషన్ చేయిస్తామ‌న్నారు. అలాగే రాబోవు కాలం లో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తామ‌ని తెలిపారు. కార్యక్రమం లో ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ విజన్ సెంటర్ కో ఆర్డినేటర్ సిరగడ వెంకట రమణ, టెక్నీషియన్ అత్రం గజనంద్, దేశగనీ కృష్ణ,అమిత్ , సభ్యులు కదేరుగుల ఆనంద్,జాదవ్ కృష్ణ, మన్పురి నవీన్, ఓస సాయి కుమార్,మాసం అరవింద్,రాకేష్, జిల్లేది శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *