సిరా న్యూస్,చొప్పదండి;
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండన్నపల్లి, న్యాలకొందపల్,హిమ్మతినగర్ గ్రామాలలో 75 మంది రైతులకు ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు రకాల కూరగాయల విత్తనాలను సోమవారము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ సిస్టర్ ప్రీతా మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతోనే కూరగాయలు పండించుకోవాలని అన్నారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన కూరగాయలు ఉపయోగించుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. రసాయన ఎరువులతో పండించిన కూరగాయలు తినడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. రసాయనాలు లేని సేంద్రియ విత్తనాల ద్వారా కూరగాయలు సాగుతో పాటు పంట మార్పిడి చేసేందుకు కృషిచేసి ఆరోగ్యంగా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సేంద్రియ విత్తనాలు వాటి ఉపయోగాలు పలు అంశాలపై రైతులకు గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సిస్టర్ దీప్తి, సిస్టర్ వెలంగిని, సంస్థ ప్రతినిధులు మర్రి మల్లేశం, నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రమేష్,రూప, స్రవంతి, మౌనిక,ప్రతినిధులు ఆయా గ్రామాల 85 మంది రైతులు పాల్గొన్నారు.