సిరా న్యూస్, హుజురాబాద్:
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకుడు బుర్ర కుమార్ గౌడ్
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బాబు సమక్షంలో 28వ వార్డు బీఆర్ఎస్ నాయకుడు బుర్ర కుమార్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, మహిళా అధ్యక్షురాలు పుష్పలత, మేకల తిరుపతి, కాజీపేట శ్రీనివాస్, తాళ్ళపెల్లి రమేష్ గౌడ్, సొల్లు దశరథం, తదితరులు పాల్గొన్నారు.