సిరా న్యూస్,హైదరాబాద్;
ఎంపి ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. భద్రత లేకుండా రేవంత్,తాను మూసి పరివాహక నిర్వాసితుల వద్దకు వెళదాము. వాళ్లు చెప్పే భాధలు వింటే మనసు కరుగుతుంది. మూసి నిర్వాసిత ప్రజలు రేవంత్ పాలనను గొప్పగా మంచి పని చేశారని అంటే రాజకీయాల నుండి తప్పుకుని ముక్కు నాలకు రాస్తానని అన్నారు. ఉప్పల్,రామంతాపూర్,అంబర్ పేట ఎక్కడికి వస్తావో చెప్పు రేవంత్. హరీష్ రావు రాసి ఇస్తే తాను ఫాలో అవుతానని అనడం రేవంత్ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ మోసం చేసే వాళ్ళను ప్రజలు గెలిపిస్తారని చెప్పిన చరిత్ర నీది. మోసం,అబద్ధం కి మారు పేరు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.