సిరా న్యూస్,హైదరాబాద్.
సాగర్ పార్క్ ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ సీనియర్ వెంకట్ స్వామి (కాకా) 95 వ జయంతి వేడుకలు జరిగాయి. సాగర్ పార్క్ లొ వెంకట స్వామి (కాకా) విగ్రహానికి ఎమ్మేల్యేలు వివేక్ , వినోద్ లతో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలను, ప్రజా స్వామ్య విలువలను ఏ విధంగా పరిష్కరించరించలేని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత వెంకట్ స్వామి. ఎన్ఎస్యూఐ నాయకుడిగా ఉన్నప్పటి నుండి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని వెనుకుండి నడిపించారు. సహకార సంఘాల లో కూడా మాకు అండగా నిలిచారు. కాకా ఆలోచనలు ఎస్సి ,ఎస్టీ, బీసీ మైనారిటీ ల కోసం కోసం అహర్నిశలు కృషి చేశారు. బలహీన వర్గాలను న్యాయం జరగడానికి వారి గొంతుగా మేమంతా ముందుకు పోతున్నాం. కాకా వారసులు వివేక్ ,వినోద్ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరారు. వెంకట్ స్వామి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని అన్నారు.
=======================