– ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
సిరా న్యూస్,హైదరాబాద్;
బతుకమ్మ పండుగలకు పర్మిషన్లు తీసుకోవాలని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రత్యేక పండుగ. మైకులు పెట్టొద్దు, సౌండు బాక్స్ లు పెట్టకుండా బతుకమ్మ ఆడుకోవాలి అని కొత్త సాంప్రదాయం పెట్టింది ప్రభుత్వమని అయన మండిపడ్డారు. గత పది సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండగ ఘనంగా నిర్వహించేవారు . కేసీఆర్ ప్రభుత్వంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందజేసేవారు. రేవంత్ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ చీరెలు ఇవ్వకుండా మానేశారు. ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ సంబరాలు చేసేవారు. బతుకమ్మ పాటలలో, కోలాటాలలో మైకులు ,సౌండ్ పెట్టొదంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో ప్రభుత్వం రాజకీయాలు చేయొద్దు. ఆడపడుచులు బతుకమ్మలో కోలాటాలు, పాటలు ఆడుతుంటే పోలీసులు ఇబ్బందులు పెట్టొద్దని అన్నారు