సిరా న్యూస్, కుందుర్పి
టీడీపీ సీనియర్ నాయకుడు ఓబుళపతి మృతి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వ్యాపారవేత్త, మాజీ ఉపసర్పంచ్ బోయ ఓబుళపతి అనారోగ్యంతో మృతి చెందారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.