సిరా న్యూస్, కళ్యాణదుర్గం
మహేంద్రకు రూ.12వేలు విలువ గల మందులు అందజేత : ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో అనారోగ్య బాధితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ భరోసా కల్పించారు. వివరాల్లోకెళ్తే…కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికిచెందిన మహేంద్ర గత కొంత కాలంగా లివర్ వ్యాధితో బాధపడుతుండగా మీసేవ బాబు ద్వారా విషయం తెలుసుకొని ఏడాది క్రితం ఆర్థిక సాయం చేశారు. ప్రతి నెల రూ.12వేలు మందులకు ఖర్చు అవుతుందని ప్రతి నెల మందులు ఇప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు బద్దే నాయక్ ను కోరగా స్పందించిన ఆయన ప్రతి నెలకు సరిపడే మందులను అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఏడాది పాటు అనారోగ్య బాధితుడికి రూ.12వేలు విలువ గల మందులు అందజేస్తున్నారు. నేడు అపోలో ఫార్మసి లో అనారోగ్య బాధితుడికి బోరంపల్లి మీసేవ బాబు చేతుల మీదుగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ అందజేశారు.