సిరాన్యూస్, ఓదెల
గుంపులలో నేషనల్ లెవల్ మానిటరింగ్ టీం సభ్యులు పర్యటన
ఓదెల మండలంలోని పొత్కపల్లి, గుంపుల గ్రామంలో నేషనల్ లెవల్ మానిటరింగ్ టీం సభ్యులు పర్యటించారు. ఈసందర్బంగా ఎన్ఎన్ఎల్ ఎం టీం వారు గ్రామ పంచాయతీ రికార్డులు, 2022 నుండి వచ్చిన ఫండ్స్ వివరాలు, ఈజీఎస్ పథకము క్రింద చేసిన పనులను పరిశీలించి నెమ్ బోర్డు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. మహిళా సంఘాల ద్వారా ఎంత రుణలు పొందిన్నారు వాటి ద్వారా ఏమి చేశారు, రెండు గ్రామములో ఎంత మంది పెన్షన్ పొందుచున్నారు , ఎన్ని జాబ్ కార్డులు వున్నాయి వంటి వివరాములు మీద గ్రామాలో పర్యటించి వాటి వివరాలు సేకరించారు. కార్యక్రమములో సీవీ బాలమురళి ఎన్ ఎల్ ఎం, సునీల్ ఎస్.కె .ఎన్ ఎల్ యం జి.తిరుపతి ఎంపీడీఓ రాఘవులు,జిల్లా ఎస్ బి ఎం అధికారి కొమురయ్య, విజిలెన్స్ అధికారి , ఎస్ రమేష్ ఏపీవో, బి శ్వేత ఈసీ ,జనార్ధన్, టి ఏ తిరుపతి నాయక్ టి ఏ , కుమార స్వామి పంచాయతీ కార్యదర్శి , రాకేష్ వర్మ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.